calender_icon.png 30 April, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యం

30-04-2025 12:22:46 AM

జహీరాబాద్, ఏప్రిల్ 29 :ఇంటినుండి వెళ్ళిన యువతి అదృశ్యమైంది. జహీరాబాద్ టౌన్ ఎస్.ఐ కాశీనాథ్ తెలిపిన వివ రాల ప్రకారం..జహీరాబాద్ పట్టణంలోని భాగారెడ్డిపల్లికి చెందిన కేశప్ప కూతురు స్వప్న ఈనెల 25న భవాని మందిర్ ప్రాంతంలో గల టైలరింగ్ నేర్చుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిందని, ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకి లభించక పోవడంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.