calender_icon.png 21 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవర్‌ను చంపిన యువతికి ఉరిశిక్ష

21-01-2025 01:29:53 AM

* తమిళనాడులో సంచలనం రేపిన ప్రియుడి హత్యకేసు

* నిందితురాలు గ్రీష్మకు శిక్షను ఖరారు చేసిన కోర్టు

తిరువనంతపురం, జనవరి 20: కేరళలో సంచలనం సృష్టించిన బాయ్‌ఫ్రెడ్ హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రధాన నిందితురాలైన గ్రీష్మను జనవరి 17న దోషిగా తేల్చిన న్యాయస్థానం ఈ మేరకు ఆమెకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సోమవారం తీర్పునిచ్చింది. గ్రీష్మకు సహకరించిన ఆమె మేనమామ నిర్మల్ కుమార్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం నెయ్యట్టింకర అడిషన్ సెషన్స్ జడ్జి ఏఎం బషీరన్ తీర్పు వెల్లడించారు.

అయితే కేసులో ఏ2గా ఉన్న గ్రీష్మ తల్లి నేరంలో పాల్పంచుకుందంటూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆమెను నిర్దోషిగా వదిలేస్తూ తీర్పుచెప్పింది. గ్రీష్మా.. షారోన్ (23) అనే యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఆమెకు తల్లిదండ్రులు వేరే పెండ్లి నిశ్చయించడంతో అందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని తన ప్రియుడైన షారోన్‌కు చెప్పింది.

వేరేపెండ్లికి షారోన్ నిరాకరించడంతో అతడ్ని చంపేందుకు పథకం వేసింది. ఇందులో భాగంగానే 2022, అక్టోబర్ 25న షారోన్‌పై హెర్బల్ మెడిసిన్ ప్రయోగం చేసింది. దీంతో అతడు అదే నెల 25న మృతిచెందాడు. మృతిపై పోలీసులు విచారించగా విషప్రయోగ విషయం బయటపడింది. మరొకరితో పెండ్లి నిశ్చయం కావడంతో.. షారోన్‌ను వదిలించుకునేందుకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు నిర్వహించిన పోలీసులను కోర్టు ప్రశంసించింది.