తల్లికి సరిగా వైద్యం చేయలేదనే కోపంతోనే దాడి
చెన్నై, నవంబర్ 13: తల్లిని క్యాన్సర్ పీడిస్తుండాన్ని చూసి ఓ యువకుడు కుమిలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కూడా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో డాక్టర్‌పై కోపం పెంచుకున్నాడు. సరాసరి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను కత్తితో పొడిచాడు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. చెన్నైకి చెందిన ఓ యువకుడి తల్లి కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతోంది.
ఆమె స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అంకాలజీ విభాగ వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌తో చికిత్స చేయించుకున్నది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో ఆమె కుమారుడు డాక్టర్‌పై కోపం పెంచుకు న్నా డు. కత్తి వెంటపెట్టుకుని బుధవారం సదరు ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌ను ఏడుసార్లు కత్తితో పొడిచాడు. గమనించిన వైద్యసిబ్బంది సదరు యువకుడిని పట్టుకు ని పోలీసులకు అప్పగించారు.
వైద్యు డి ప్రస్తుతం విషమంగా ఉందని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. వైద్యుడిపై దాడి ఘటనపై సీఎం స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజలకు విస్తృతమైన సేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడులు చేయడం సరికాద న్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందని, వైద్యులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.