* మద్దతు ధర రూ.50 తగ్గింపుపై ఆగ్రహం
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): ఆరుగాలం కష్టపడి పత్తి పండిస్తే మార్కెట్‌లో సరైన ధరలు లేవని, మరోవైపు సీసీఐ ఇచ్చే మద్దతు ధరలో రూ.50 తగ్గిస్తున్నారని గురువారం బేల మండల కేంద్రంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి కొన్ని గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. సీసీఐ మద్దతు ధర క్వింటాకు కేవలం రూ.7,521 ఉండగా, నిర్వాహకులు దానిలోనూ రూ.50 కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే మద్దతు ధర పెంచాల్సింది పోయి, తగ్గించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ధర పెంచని పక్షంలో మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకో కారణంగా హైవేపై కిలోమీటర్ల మేర గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి, వారితో రాస్తారోకోను విరమిం పజేశారు. రైతులకు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు ప్రమోద్‌రెడ్డి, పార్టీ నేతలు మద్దతు పలికారు.