calender_icon.png 10 January, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై పెట్టింది అత్యంత చెత్త కేసు

05-01-2025 12:58:48 AM

* మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, జనవరి 4-: ఈ రేస్ విషయంలో కేటీఆర్‌పై పెట్టిన కేసు దేశంలోనే అత్యంత చెత్త కేసు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో మాట్లాడారు. రైతుభరోసాపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ఉద్దేశంతోనే మోదీ సహకారంతో కాంగ్రెస్ కేసుల నాటకం ఆడుతున్నదని విమర్శించారు. అడ్డగోలుగా అప్పులు చేస్తూ మంత్రులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన రూ.1.28 లక్షల కోట్లు అప్పును ఏం చేశారో చెప్పాలన్నారు.