21-03-2025 01:48:23 AM
హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి): ప్రపంచానికి తెలంగాణ గొప్పద చ్‌ఫూన్ని తెలియజేసేందుకు మిస్ వరల్డ్ పో సదవకాశంగా భావిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పోటీలతో ప్రపంచ మొత్తం నగరంవైపు చూస్తుందన్నారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల్లోంచి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడాన్ని గర్వకారణంగా భావిస్తున్నట్టు చెప్పారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ప్రీ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జూపల్లి పాల్గొని ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీగా ఎదుగుతున్న విశ్వనగరం మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
మహిళల ఆత్మ సౌం బయటపెట్టడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలు గొప్ప పాత్ర పోషిస్తున్నారని జూపల్లి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడే విధంగా పోటీలను నిర్వహించి విజయవంతం చేస్తామన్నారు.
ఈ సందర్భంగానే తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ సుం క్రిస్టినా పిజ్కోవా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ ఫిలిగ్రి వెండి వస్తు చేర్యాల నఖాషి చిత్రాలతోపాటు పో చంపల్లి చేనేత పట్టు వస్త్రాల తయారీ విధానం అతిథులను ఆకట్టుకుంది.
27కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
మిస్ వరల్డ్ పోటీలకు చేస్తున్న ఖర్చులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి జూపలి కృష్ణారావు మండిపడ్డారు. పోటీలకు మొత్తం రూ.55కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తుండగా అందులో రూ.27కోట్లను మాత్రమే ప్రభుత్వం భరిస్తుందన్నారు. మిగిలిన సగం ఖర్చును మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ పోటీల్లో స్పాన్సర్లను భాగస్వామ్యం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని వివరించారు. వీటిని రాజకీయం కోణంలో చూడొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
నమస్తే అంటూ క్రిస్టినా పలకరింపు
నమస్తే ఇండియా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శన మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రశంసలు కురిపించారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రపంచ సద్భావన, సంస్కృతి, సాధికారతకు ఈ పోటీలను ఓ వేదికగా మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ జూలియా మోర్లీ అభివర్ణించారు.
పోటీల ద్వారా ప్రపంచాన్ని తెలంగాణకు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, భాషా శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్
* మే 7వ తేదీ నాటికి మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్‌కు చేరు కుంటారు.
* గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో- మే 10న ప్రారంభోత్సవ వేడుక
* మే 12న పోటీదారులు(ఆసియా) బుద్ధవనం సందర్శన కోసం నాగార్జున సాగర్ పర్యటనకు
* మే 13న చార్మినార్, లాడ్‌బజార్‌ను సందర్శన.. చౌమహల్లా ప్యాలెస్‌లో విందు
* మే 14న వరంగల్‌లోని కాళోజీ కళా క్షేత్రంలో విద్యార్థులు, సంఘాలతో అమెరికా, కరేబియన్‌కు చెందిన పోటీదారులు సమావేశం. తర్వాత రామప్ప ఆలయ సందర్శన
* మే 15న యూరప్ పోటీదారుల యాదగిరిగుట్ట సందర్శన అనంతరం పోచంపల్లిలో పర్యటన
* మే 16న - ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ పోటీదారులు హైదరాబాద్‌లోని యశోద, అపోలో అసుపత్రుల సందర్శన
* మే 17న- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్స్.. అనంతరం పోటీదారుల ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్ సందర్శన
* మే 19న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమా అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. అనంతరం ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ ప్రాంగణాల్లో పర్యటిస్తారు.
* మే 20, 21 తేదీల్లో ఖండాల వారీగా ఏర్పాటైన పోటీదారుల గ్రూపులు టీ హబ్ వద్ద ఈవెంట్లలో పాల్గొంటాయి.
* మే 21న పోటీదారులు శిల్పారామం వేదికగా జరిగే ఆర్ట్స్‌అండ్‌క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు
* మే 22న - శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్ కార్యక్రమం
* మే 23న -హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్ కార్యక్రమం
* మే 24న - హైటెక్స్‌లో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫైనల్ జరుగుతుంది.
* మే 25న - హైటెక్స్‌లో జ్యువెలరీ, పెర్ల్ ఫ్యాషన్ షో నిర్వహణ
* మే 26న - బ్రిటిష్ రెసిడెన్సీ, తాజ్ ఫలక్‌నుమాలో పోటీదారులకు విందు, సాంస్కృతిక ప్రదర్శనల ఏర్పాటు
* మే 31న - హైటెక్స్‌లో మిస్ వరల్డ్ లైవ్ ఫినాలే కార్యక్రమం
* జూన్ 2న - తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోటీల్లో విజ యం సాధించిన వాళ్లు రాజ్‌భవన్‌లో తెలంగాణ సీఎం, గవర్నర్‌ను కలుస్తారు.
మిస్ వరల్డ్ పోటీలతో పర్యాటకానికి ఊతం
హైదరాబాద్, మార్చి20: తెలంగాణ బ్రాండ్‌కు గ్లోబల్ ఇమేజ్ తెచ్చేందుకు, ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో మే 7-31తేదీల మధ్య ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుంది.
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంతోపాటు రాష్ర్ట పర్యాటక రంగానికి నూతన జవసత్వాలను అందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి సుందరీమణులు రానున్నారు. అంతర్జాతీయ మీడియాకు సంబం 3వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ క్రమంలో ఓ వైపు పోటీలను నిర్వహిస్తూనే రాష్ట్రంలోని పర్యటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి పోటీదారులతోపాటు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రభుత్వం తీసుకెళ్లనుంది.
ఇందుకోసం ప్రభుత్వం 20 పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసింది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎంపిక చేసిన పర్యాటక ప్రదేశాలు..
పోచంపల్లి, హైదరాబాద్, యాదగిరి గుట్ట, రామప్ప, బుద్ధవనం, ఎక్స్పీరియం, అమ్రాబాద్, భద్రాచలం, జోగులాంబ, అనంతగిరి, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, కాకతీయుల చరిత్ర, మేడారం సమ్మక్కసారక్క గద్దెలు, లక్నవరం సరస్సు, బుద్ధవనం, నాగార్జునసాగర్ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధస్థూపం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వేములవాడ.