22-02-2025 12:41:05 AM
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీశైలం
మునుగోడు/నాంపల్లి, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): సమాజంలో అన్ని సమ స్యలకు పరిష్కారం సోషలిజమేనని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరులో నిర్వహించిన రెడ్ బుక్ డేలో సీహెచ్ లక్ష్మీనా రాయణతో కలిసి ఆయన మాట్లాడారు.
పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల తోపాటు సమస్యలకు అంతి మ పరిష్కారం సోషలిజమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాంపల్లి మండల కార్యదర్శి నాం పల్లి చంద్రమౌళి, చండూరు మండల కార్య దర్శి జెర్రిపోతుల ధనుంజయ, మండల కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, లింగయ్య, నాగరాజు సైదులు కాశయ్య పాల్గొన్నారు.