1791లో ‘ది అబ్జర్వర్’ మెదటి ప్రచురణ
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రపంచంలోనే తొలి ఆదివారం వార్తాపత్రికగా గుర్తింపు పొందిన ‘ది అబ్జర్వర్’ను అమ్మకానికి పెట్టినట్లు దాని యజమాని మంగళవారం ప్రకటించారు. ఈ బ్రిటీష్ వీక్లీకి సంబంధించి 1791 డిసెంబర్ 4న డబ్లూఎస్ బ్రౌన్ ఆధ్వర్యంలో మొదటి ప్రచురణ విడుదల చేశారు. ప్రారంభంలో నష్టాలు రావడంతో ఈ పత్రికను ప్రభుత్వానికి అమ్మేందుకు బ్రౌన్ సోదరుడు ప్రయత్నించగా అది విఫలమైంది. అయితే ఈ వీక్లీకి బ్రిటీష్ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది. తదనంతరం నిలదొక్కుకున్న ఈ పత్రికను 1993లో జీఎంజీ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లపాటు ఈ వీక్లీని నడిపిన జీఎంజీ సంస్థ తాజాగా ఈ పత్రికను అమ్మకానికి ఉంచగా.. పలు మీడియా సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.