calender_icon.png 4 November, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీతారామ’ పనులను వేగవంతం చేయాలి

03-11-2024 12:00:00 AM

  1. ప్రాజెక్ట్ పూర్తయితే 3.28 లక్షల కొత్త ఆయకట్టు
  2. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు నిర్ణయం
  3. సీతారామ లిఫ్ట్ నిర్మాణంపై జలసౌధలో సమీక్ష
  4. పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాగు నీరు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

అందుకు అవసరమైన భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీతారామ లిఫ్ట్  ప్రాజెక్ట్ నిర్మాణపు పనులపై శనివారం జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష   నిర్వహించారు. 2025, జులై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే రాష్ర్ట ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

అవసరమైన భూసేకరణకు గాను ప్రత్యేకంగా సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను 6,234.91 ఎకరాల భూమిని సేకరించినట్లు  వివరించారు. ఇంకా 993 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు.

అందుకోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే 3.28 లక్షల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. 550 చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరుతుందన్నారు. తద్వారా అదనంగా మరో 1.16 లక్షల ఎకరాలు సాగవుతుందన్నారు.

రూ.6,401.95 కోట్లు ఖర్చు..

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రూ.6,401.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఉత్తమ్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా సీతారామను తాము పరిగణిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

సత్తుపల్లి ట్రంక్ కెనా ల్, యాతలకుంట వరకు పనులు పూర్తి చేసుకుంటే రాబోయే పంటకు సాగునీరు అందిం చేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపా రు. డిజైన్లు, టెంటర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. సమీక్షలో నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సి అనిల్ కుమార్ పాల్గొన్నారు.