calender_icon.png 14 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

08-11-2024 04:47:41 PM

పెద్దపల్లి: మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి ప్రాజెక్ట్ ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కాకుండా, పనులు వేగవంతం ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యం సకాలంలో అందించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించాలని అన్నారు. ఇదిలా ఉండగా క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ఫ్లై యాష్ వెంటనే సరఫరా చేయాలని, నిర్మాణ పనులు నిరంతరాయంగా జరిగేందుకు ఫ్లై యాష్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపీపీ) జనరల్ మేనేజర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.