మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్
హనుమకొండ, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఈ నెల 20లోగా కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలని పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో చేపట్టిన కళాక్షేత్రం భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనంగా కార్మికు లను నియమించి షిఫ్టుల వారీగా పనులు చేయించాలని అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య సీటింగ్ ఏర్పాటు, బాల్కనీ సీటింగ్‌లపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు. వారివెంట మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట రామిరెడ్డి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఉన్నారు.