ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌ను నిర్బందించిన కార్మికులు
మొఖం చాటేసిన కంపెనీ యాజమాన్యం
కామారెడ్డి (విజయక్రాంతి): బీడి కార్మికులకు, టేకేదార్లకు రావాల్సిన డబ్బులను ఇవ్వడంలో బీడి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని బీడి కార్మికులు, టేకేదారులు ఆందోళన చేపట్టిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట్‌లో దేశాయిబీడి కంపెనీలో శుక్రవారం చోటుచేసుకుంది. గతంలో కూడా బీడి కార్మికులు సీఐటీయు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.చర్చలకు పిలిచిన కంపెనీ యాజమాన్యం మొఖం చాటేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీడి కంపెనిని ముట్టడించిన కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రమ్మని చెప్పిన దేశాయిబీడి కంపెనీ యాజమానులు, అధికారులు, కార్మికులు వచ్చిన రాకపోవడంతో వారితీరుపై కార్మికులు, టేకేదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, బీడి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.