calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకం పనులను వారం రోజులలో పూర్తి చేయాలి

19-03-2025 12:51:17 AM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల, మార్చి 18 ( విజయక్రాంతి) : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పనుల క్రింద చేపట్టిన సి.సి రోడ్లు నిర్మాణపు పనుల పురోగతిపై మండలాల వారిగా ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో పూర్తి నాణ్యత, పారదర్శకత పాటించడంతో పాటు, ప్రతి పనికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, పంచాయతీ రాజ్ ఈ.ఈ దామోదర్ రావు, డి.ఈలు, ఎ.ఈలు, తదితరులు పాల్గొన్నారు.