calender_icon.png 26 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులు నాణ్యతతో పూర్తి చేయాలి

25-12-2024 02:03:46 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామా న్ని డిప్యూటీ సీఎం సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయనవెంట వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు నూతి సత్యనారాయణ, శీలం వెంకటనర్సిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, మల్లు రామకృష్ణ ఉన్నారు.