calender_icon.png 16 January, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ విజ్ఞాన కేంద్రంలో పనులు పూర్తి చేయాలి

11-09-2024 02:11:27 AM

కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలు

భీమదేవరపల్లి, సెప్టెంబరు 10: మాజీ ప్రధాని పీవీ స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రంలో ఆడిటోరియం, యాంపి థియేటర్, సైన్స్ మ్యూజియం, గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్‌ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లిలో ఆమె పర్యటించారు. పీవీ విజ్ఞాన కేంద్రంలో పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం వంగర ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని ఎక్స్‌రే యంత్రం మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కస్తూర్భా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఈవో వాసంతి, డీఎంహెచ్‌వో లలితాదేవి, ఆర్డీవో వెంకటేశ్ ఉన్నారు.