న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రసంగాన్ని తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు సూక్తి తో ఆమె ప్రారంభించడం విశేషం. “దేశమం టే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్” అంటూ తెలుగు కవి గురజాడ సూక్తిని తన తొలి వ్యాఖ్యల్లో ప్రస్తావించారు.
గురజాడ రాసిన ఈ దేశభక్తి గీతం నేటికీ తెలుగు ప్రజ లు పాడుకుంటూనే ఉంటారు. గురజాడ రచనలు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించాయి. బాల్య వివాహం, వరకట్న వ్యవస్థపై గురజాడ రాసి న కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది.
74 నిమిషాల ప్రసంగం..
పార్లమెంట్‌లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్‌దే. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు.
దీంతో బడ్జెట్ చరిత్రలో అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకుముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషా ల పాటు చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. కాగా, కాగా, 2024-25 బడ్జెట్ సందర్భంగా నిర్మలా 86 నిమిషాలు ప్రసంగించారు. కాగా, శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 74 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.