calender_icon.png 4 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులకు ఇచ్చిన మాట తప్పం

10-07-2024 04:12:28 AM

  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం 

ముషీరాబాద్, జూన్ 9: ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ ఉర్ధూ జర్నలిస్టు ఫైజ్ అహ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మం త్రి మాట్లాడారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటిని పరిష్కరించ డంలో మీడియాది ప్రముఖ పాత్ర ఉంటుందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఉత్తమ జర్నలిస్ట్‌గా ఎంపికైన వై.నరేందర్‌రెడ్డికి చేసి ఫైజ్ మహ్మద్ అస్గర్ స్మారక అవార్డును అందజేశారు. హెచ్‌యూజే అధ్యక్షుడు శిగ శంకర్‌గౌడ్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవలపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్ పాల్గొన్నారు.