సంస్థ అధినేత పాషికంటి రమేశ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ.. ఆధునీకరణ దిశగా ముందుకుసాగేందుకు మన అగ్రిటెక్ సంస్థ కీలక పాత్ర పోశిస్తోందని సంస్థ అధినేత పాషికంటి రమేశ్ అన్నారు. మన అగ్రిటెక్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రముఖ దక్ష కంపెనీ వారి డ్రోన్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పనిముట్లతో రైతుల సమయం, ఖర్చు ఆదా చేసుకోవచ్చాన్నారు. స్ప్రే చేయడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చని తెలిపారు.
డ్రోన్ స్ప్రేయర్స్ కావలసిన వారు మన అగ్రిటెక్‌ను సంప్రదించాలని సూచించారు. దీంట్లో 10 లీటర్ల సామర్థ్యంతో రెండు బ్యాటరీలుంటాయని చెప్పారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3ఎకరాల్లో పని చేస్తుందన్నారు. ఎకరానికి కేవలం 5 నుంచి 7నిమిషాల సమయం మాత్రమే పడుతుందని చెప్పారు.