హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): మియాపూర్‌లో యు వతిపై జరిగిన లైంగిక దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని గురువారం రాసిన లేఖలో కమిషన్ పేర్కొంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని కడ ప జిల్లాకు చెందిన ఓ యువతి(25) ఉద్యో గం కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చింది. ఉప్పల్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ జేఎస్‌ఆర్ సన్‌సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా జాయిన్ అయింది. అదే కంపెనీలో సే ల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తు లు కూల్ డ్రింక్స్, స్వీట్స్‌లో మత్తుమం దు కలిపి బుధవారం యువతిపై లైంగి క పాల్పడ్డారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది.