మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ తీగలు తెగిపడి ఓ మహిళకు తీవ్ర గాయాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రానికి చెందిన బెజ్జరి రమేఖకు గత సంవత్సరంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టగా వీరి ఆలాన పాలనా చూసుకోవాడానికి ములుగు జిల్లా రాయినిగూడెం దుబ్బ గూడెంకు చెందిన రమేష్ అత్తగారైన పెనుక సారమ్మ ఇటీవలే గంగారంకు వచ్చింది. రమేష్ పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండగా బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సారక్క కేంద్రానికి వచ్చిన సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగలపై పక్షులు వాలగా షార్ట్ సర్కూట్ కారణంగా తీగ తెగి సారక్క మీద పడింది. విద్యుత్ తీవ్రతకు ఆమె వెంటనే పడిపోగా అక్కడ ఉన్న మిగితావారు వెంటనే వైద్యం కోసం స్థానిక గంగారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చగా అక్కడ ప్రాధమిక చికత్స చేసి నర్సంపేట ఆసుపత్రికి 108 వాహానం ద్వారా పంపించారు.