17-04-2025 05:31:13 PM
బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన నాయకులు...
రావులపల్లి రాంప్రసాద్..
చర్ల (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్వర్యంలో గురువారం భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మండల కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ... ఎండలు తీవ్రంగా ఉండడంతో ఆదివారం సంతకు వచ్చే ప్రజలకు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, పార్టీ నాయకులతో చర్చించి 22 వేలు పెట్టి స్టీల్ ఫ్రిజ్ ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం చర్ల పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని, చర్ల మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలని అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు సోయం రాజారావు మాజీ ఎంపీపీ కోదండరామయ్య పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు, మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పాల సౌజన్య పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, పోలిన రామచంద్రరావు, సీతాపతి రాజు, దినసరపు భాస్కర్ రెడ్డి సూర్యనారాయణ రాజు, గొర్ల రాజబాబు ,పంజా రాజు తడికల బుల్లేబ్బాయి, కోరం నాగేంద్ర, పొడియం మురళి కారం కన్నారావు రాట్నాల శ్రీరామ్మూర్తి తెల్లం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.