లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూ చీలు భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకిం గ్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సాక్‌సలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డ్డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాల వేళ సూచీలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 81,576.93 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,381) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో మళ్లీ 82వేల మార్కును అందుకుని 82,072.17 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 591 పాయింట్ల లా భంతో 81,973 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 163.73 పాయింట్ల లాభంతో 25,127.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 77.03 డాలర్లుగా కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2675 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.