మూసీ పరీవాహక ప్రాంతాన్ని శుద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి సంకల్పాన్ని నిజం చేయాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్..
ఘట్ కేసర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని నిజం చేయాలంటే మూసీ పునరుజ్జీవనం కోసం నడుం బిగించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎదులబాద్ గ్రామం నుండి మూసీ పునరుజ్జీవనం కోసం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవనం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు పట్టుదలతో ఉన్నారని చెప్పారు.
మూసీ నదిని శుద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతంగానికి కుల వృత్తులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు, మూసీ ప్రక్షాళనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం మున్సిపాలిటీల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్ లు, కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.