ఉరేసుకొని భర్త ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 14: భార్య మరో వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామానికి చెందిన గంగనమోని నగేశ్(25)కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది.
కాగా, కొంతకాలంగా భార్య వేరే వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురైన నగేశ్ సో మవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు యాచారం పోలీసులు తెలిపారు.