27-02-2025 02:11:21 AM
మహబూబ్‌నగర్; ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): శివ శివ శంకర పరమేశ్వర పాహి మాం అంటూ శైవ క్షేత్రాలు దేవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా ఆలయా లకు భక్తులు పోటెత్తారు. భక్తులు ఉపవాసలు పాటించి దైవదర్శనం చేసుకున్నారు. రుద్రాభిషేకాలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతూ స్మరించుకున్నారు.
జిల్లా కేం ద్రంలో కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం తో పాటు వీరన్నపేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం పెద్ద శివాల యంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం భక్తులు దర్శనం చేసుకున్నారు. పిల్ల లమర్రి రోడ్ లోని కామాక్షి ఏకాంబరేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకాలు నిర్వహించారు. మునప్పగుట్టలోని మౌనేశ్వరి స్వామి ఆలయం ద్వారకమై బాబా మందిరంలో సింహగిరిలో ఐశ్వర్య స్వామి దేవాలయంలో ఉదయం నిత్య పూజ అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు.
ఏనుగొండలోని సాం బశివనం శ్రీనివాస కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి పద్మావతి కాలనీలో వీరాం జనేయ స్వామి ఆలయాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శివాలయాల్లో భక్తులు ఉదయం నుం చి రాత్రి వరకు శివనామస్వరనతో ప్రత్యేక పూజలు చేశారు.
శివ నామస్మరణతో మారుమోగిన జోగులాంబ ఆలయం
గద్వాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): శివరాత్రి పర్వదినం సందర్బంగా జోగులాంబ జిల్లాలోని అలంపూర్ లో ఐదవ శక్తి పీఠం అయిన జోగులాంబ ఆలయం లోని బాల బ్రహ్మేశ్వరాలయం మొత్తం శివ నామ స్మరణతో మారు మోగింది. బుధవారం ఉదయం నుండే ఆలయం లో గల అమ్మవారికి, బాల బ్రహ్మేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య లో రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఆలయ నిర్వహణ అధికారులు ముందస్తు చర్యలను చేపట్టారు.
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
వనపర్తి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం అడ్డాకల్ మండలం కందూరు గ్రామంలో గల స్వయంభు రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్తం ఉందని, కం దూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వయంభు రామలింగేశ్వరుని దర్శించుకుంటే ఏకంగా కాశీ విశ్వేశ్వరున్ని దర్శిం చుకున్నంత పుణ్యం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కందూరుకు మరో చరిత్ర ఉందని ఇక్కడ ఉన్న కల్ప వృక్షాలు మరెక్కడా లేవని ఆయన అన్నారు.