నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన అంతా మోసమని బిజెపి అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమయ్య ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బిజెపి ఏడాది పాలన చార్జి సీటును విడుదల చేశారు. 6 గ్యారంటీ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్, మల్లికార్జున్రెడ్డి, రాజేందర్ పొడెల్లి గణేష్ భూపతిరెడ్డి అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు.