13-02-2025 12:13:31 AM
ఆనంద్ వర్ధన్, ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సామ్, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నిదురించు జహాపన’. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. “ఇది చాలా ఇంట్రస్టింగ్ జర్నీ. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీరు చూస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను”అన్నారు. డైరెక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం నిద్ర చుట్టూ ఉంటుందని తెలిపారు.