calender_icon.png 20 April, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబమంతా ఆత్మహత్యాయత్నం

11-12-2024 01:55:47 AM

  • * అప్పులు చేసి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన కొడుకు

* నష్టపోయి, అప్పులు తీర్చే మార్గం లేక.. 

* పురుగుల మందు తాగిన నలుగురు

* ఆసుపత్రికి తరలింపు

బెల్లంపల్లి, డిసెంబర్ 10: షేర్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడి నష్టపోయి, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓకుటుంబంలోని నలుగురు పురుగుల మందు తాగిఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కాసిపేట గ్రామంలో చోటుచేసుకుంది. కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య (60), శ్రీదేవి(50) దంపతులు. గ్రామంలో కిరాణ దుకాణం నడుపుతూ, పాలవ్యాపారం సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు.

వారికి కుమార్తె చైతన్య (30), కుమారుడు శివప్రసాద్ (26)  ఉన్నారు. శివప్రసాద్ తాను పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేసి, త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో కొం దరి వద్ద అప్పులు చేసి ఆన్‌లైన్ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టాడు. షేర్‌మార్కెట్‌లో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు బాకీ చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం కలిపించకపోవడంతో మంగళవారం ఉదయం శివ ప్రసాద్‌తో పాటు మొండయ్య, శ్రీదేవి, చైత న్య ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. 

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మార డంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.