calender_icon.png 28 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెస్యూ వేగవంతం

28-02-2025 01:59:16 AM

  1. సవాళ్లను అధిగమిస్తూ ప్రమాద స్థలికి సహాయక బృందాలు
  2. లోకో ట్రైన్ సాయంతో బురద, మట్టి తోడివేత
  3. రెండ్రోజుల్లో కార్మికుల ఆచూకీ!

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు 11 రకాల రెస్క్యూ టీంలు 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాద స్థలికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత వల్ల సుమారు 16 వందల టన్నుల బరు వు గల టీబీఎం మిషన్ సైతం 100 మీటర్లు వెనక్కి తీసుకురావడంతో 13.5 కి.మీ.ల వద్ద డేంజర్ జోన్ ప్రాంతంలో సుమారు 8 ఫీట్ల మేర బురద మట్టి పేరుకుపోయింది.

ఆ ప్రాంతంలో కార్మికుల ఆనవాళ్లు లభించే అవకాశం ఉండటంతో జీఐఎస్ సాంకేతికతను ఉపయో గించి కార్మికుల జాడను కనిపెట్టే విధం గా ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ర్యాట్ హోల్ మైన్స్ రెస్క్యూ టీం, నేవీ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, సింగరేణి తదితర రెస్క్యూ టీం సభ్యులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. 12వ కిలోమీటర్ల నుంచి పేరుకుపోయిన మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తూ కన్వేర్ బెల్ట్ మరమ్మతు పనులను వేగవంతం చేశారు.

మరోపక్క టీబీఎం మిషన్ సైతం పూర్తిగా కట్ చేసి కార్మికులను బయటికి తీసేందుకు గ్యాస్ కట్టర్ ద్వారా భాగాలను వేరు చేస్తున్నారు. నీటి ఊటను అధిగమిం చేందుకు డీ వాటరింగ్ కెపాసిటీని కూడా పెంచేందుకు భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 11 రకా ల రెస్క్యూ టీం విభాగాలన్నీ నిర్విరామంగా పనిచేస్తూ రెండు రోజుల్లోనే కార్మికుల జాడ కనిపెట్టేందుకు ప్రణాళిక రచించారు.

మరో రెండు నెలల్లో తిరిగి యధాస్థితికి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్మికుల జాడ కనిపెట్టి బయటికి తీసిన అనంతరం ప్రాజెక్టు నిర్మాణ అంశంపై ప్రకటిస్తామని కంపెనీ చైర్మన్ జయప్రకాష్ గోరే మీడియాకు తెలిపారు.