కోదాడ, ఫిబ్రవరి ౩ ః అదృశ్యమైన ఆరుగురు గురుకుల విద్యార్థుల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట ఆవాస గ్రామమైన నెమలిపురి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం నుంచి ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటనపై గురుకుల స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇందులో భాగంగానే స్పందించిన కోదాడ రూరల్ పోలీసులు 10 గంటల్లోనే ఈ అదృశ్యమైన కేసును చేదించి తల్లితండ్రుల కళ్ళల్లో ఆనందం నింపారు. అయితే శనివారం రాత్రి 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించగా, వారిలో కొంతమంది విద్యార్థులు మద్యం సేవించి గొడవ పడ్డార ని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఆరుగురు విద్యార్థులను మందలించారని, దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థులు కనిపించ కుండా పోయారని సహా విద్యార్థులు చెప్పు కొచ్చారు.
ఈ నేపథ్యంలో స్కూల్ ఆవరణ లోకి మద్యం ఎలా వచ్చింది అనే విషయం పై గురుకుల స్కూల్లో జరుగుతు న్న పలు సంఘటనలపై విచారణ చేస్తున్నామని కోదాడ రూరల్ ఎస్సు అనిల్ రెడ్డి తెలిపారు.