18-04-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 17(విజయక్రాంతి) : మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. ఇందిరా మహి ళా శక్తి ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తూ కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మహిళా సమాఖ్యలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల నిర్వ హణ బాధ్యతను అప్పగిస్తోంది.
ఇందుకోసం మార్చి 8న అంతర్జా తీయ మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో బస్సుల ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని 8 డిపోల పరిధిలో 137 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో నూతన సంఘాల ఏర్పాటుతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు బస్సుల నిర్వహణకు అవసర మయ్యే రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ల ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, మీ- సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆహార కేంద్రాలు తదితర వాటి ఏర్పాటుకు సహకారం అందిస్తోంది.
అద్దె ప్రాతిపదికన...
మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఉమ్మ డి జిల్లాలోని డిపోల పరిధిలో సరిపడా బస్సులు లేవు. దీంతో ఉదయం, సా యంత్రం వేళల్లో బ స్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలుతో కొంత వరకైనా సమస్య తీరనుంది.
ఈ క్రమంలో మహిళా సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. దీంతో మండల మహిళా సమాఖ్య లు పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆర్టీసీ సంస్థ ఏడేళ్లపాటు ప్రతి నెలా అద్దె చెల్లించనుంది. దీంతో మహిళా సంఘాల మహిళలకు ఆర్థిక ఊతం లభిస్తుంది. మరోవైపు రూ.లక్షల విలువైన బస్సు సమాఖ్యసొంతంకానుంది.
రద్దీ నేపథ్యంలో 137 కొత్త బస్సుల కోసం...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేశాక అన్ని డిపోల్లో బస్సుల కొరత తీవ్రమైంది. రద్దీతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేక ఉన్న వాటినే పంపిస్తున్నారు. ఇవి చాలా ఏళ్ళకిందటివి కావడంతో తరచూ మరమ్మతుకు గురవుతున్నాయి.
పండగలు, జాతరలు, ముఖ్యమైన రోజుల్లో ప్రయాణీ కుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్భవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 8 డిపోల పరిధిలో 137 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ అధికా రులు చెబుతున్నారు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎంతమేరకు సఫలీకృతం చేస్తారో వేచిచూడాల్సిందే.
ప్రతిపాదనలు పంపాం... : ప్రభులత, ఆర్‌ఎం, సంగారెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 137 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపిం చాం. అయితే ఉన్నతాధికారుల ఎన్ని బస్సు లు మంజూరు చేస్తారో తెలియాల్సి ఉంది. ఇంకా పూర్తిస్థాయి సమాచారం లేదు. ఇందులో 72 ఎక్స్ప్రెస్ బస్సులు, 65 పల్లెవెలుగు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించాం.