calender_icon.png 15 April, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధ్యాన్యాన్ని వెంటనే తూకం వేసి లోడ్ చేయాలి

10-04-2025 12:58:14 AM

అదనపు కలెక్టర్ జీ వెంకటేశ్వర్లు

వనపర్తి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) :  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో తేమశాతం  నిర్దేశించిన స్థాయిలో వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు  బుధవారం కొత్తకోట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్  సందర్శించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో తేమశాతం  నిర్దేశించిన స్థాయిలో వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా టెంట్ వేసి, ఫ్లెక్సీ కట్టడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

ధాన్యం క్లీనింగ్ విషయంలో రైతులకు అవగాహనా కల్పించాలని ఇంచార్జి లకు, వ్యవసాయ అధికారులకు సూచించారు. ఒక కేంద్రంలో ఒకే రకమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దొడ్డు, సన్నాలు ఒకే దగ్గర కొనుగోలు చేయడానికి అనుమతించేది లేదని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తాలు లేకుండా చేసేందుకు ఫ్యాన్లు, సహా సరిపడు గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు కచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో మార్కెటింగ్ అధికారిని సంప్రదించాలని సూచించారు. సివిల్ సప్లై డిఎం జగన్,  కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పీపిసి ల ఇంచార్జీలు, తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు