calender_icon.png 3 April, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

02-04-2025 12:28:35 AM

* కడ్తాల్‌లో సన్నబియ్యం పంపిణి ప్రారంభించిన మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా 

కడ్తాల్, ఏప్రిల్ 01 ( విజయ క్రాంతి ) : సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, పేదల కడుపు నింపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణి చేస్తుందని ఆమనగల్లు  మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా అన్నారు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో మంగళవారం  మూడు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణి చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్టంలో కూడా సన్నబియ్యం పంపిణి చేయడం లేదని తెలంగాణ రాష్టంలో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణి చేస్తున్నారని అన్నారు.

అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా సన్న బియ్యం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్  వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు బీక్యా నాయక్,  సింగల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.