12-03-2025 12:58:07 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు/అశ్వాపురం,మార్చి11(విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి సొందే సావిత్రమ్మ సొంత స్థలంలో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను సైతం అందిస్తామన్నారు.అనంతరం అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.