calender_icon.png 6 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

04-01-2025 02:11:07 AM

నాగర్ కర్నూల్, జనవరి 3 (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికా రులు, స్థానిక ముఖ్య నేతలతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్నప్పటికీ గత పదేళ్ల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమై ప్రజాధనాన్ని లూటీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవ లం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. వచ్చే సంక్రాంతి పండగకి రైతు భరోసా, భూ మాత, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు.  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు అవకాశం లేకుండా, పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.