calender_icon.png 4 April, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

03-04-2025 04:32:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పేదల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మండలంలోని పెద్దబూద గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ... ప్రతి పేదవారికి సన్న బియ్యం అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు. ఇందులో భాగంగానే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం సహించదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్, ఆర్డీవో హరికృష్ణతో పాటు, తహసిల్దార్ జోష్న, సీనియర్ నాయకులు కారుకూరి రాoచందర్, మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.