01-04-2025 04:24:26 PM
ఎమ్మెల్సీ దండే విఠల్..
కాగజ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్ లోని రేషన్ షాపు వద్ద అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యం వాడుకోవాలని దళారులకు అమ్ముకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, మాజీ జడ్పి చైర్మన్ సిడం గణపతి, నాయకులు షబ్బీర్, శరత్, తుడూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు.