calender_icon.png 3 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

02-04-2025 12:20:48 AM

గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఏఫ్రిల్ 1 : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, అనాజ్‌పూర్ గ్రామంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ప్రారం భించారు.

ఈ సందర్భంగా చిలుక చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.