08-04-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం (భూపాలపల్లి), ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అనే దృష్టితో ప్రతీ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి లో వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట సమయంలో స్పందించాలని సూచించారు.
ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని పేర్కొంటూ, ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరింఛి ప్రజల మన్ననలు పొందాలని, అదే ప్రతి ఉద్యోగ జీవితానికి ఆశీర్వాదం అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.