15-04-2025 01:46:18 AM
మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఏప్రిల్14(విజయక్రాంతి): రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి మంథని లో పలు గ్రామాలకు రొడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ .. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
మంథని పట్టణం పరిసర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించామని అన్నారు. ఎక్లాస్ పూర్ నుంచి ఖమ్మం పల్లి రహదారి పునరుద్ధరణ పనులను 11 కోట్ల 90 లక్షలతో, ఖమ్మం పల్లి నుంచి ఓడేడు వరకు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను 30 కోట్లతో, మంథని నుంచి ఓడెడు వరకు 19 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను 60 కోట్లతో చేపట్టడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం, సులభంగా వాహన మూమెంట్ ఉండేలా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
పగుళ్ల గుట్టలో దేవాలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వారికి సౌకర్యంగా ఉండే విధంగా 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు జరగాలని, దీనిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఒకసారి రోడ్డు వేస్తే 15 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య రావద్దని మంత్రి సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మన రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడాలని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని తమ పార్టీ, ప్రభుత్వం విధానంగా పని చేస్తుందని అన్నారు.
మంథని పట్టణంలో కోటి రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని హంగులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని, వీటిలో ఒక చిన్న గ్రంథాలయం స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటావని అన్నారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఆర్ అండ్ బి ఎస్. ఇ. కిషన్ రావు,ఈ ఈ భావ్ సింగ్ , ఆర్డీవో సురేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అంబేడ్కర్ (నించాలని, చేశాభివృద్ధికి అంబేడ్కర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. ప్రపంచ గర్వించదగ్గ గొప్ప మేధావి అంబేడ్కర్ అని, ఆయన చూపిన మార్గంలో నడివి దేశాన్ని అభివృద్ధి పథంలో జాతి నుకకదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొలకూరి శంకర్, వివిధ దనిత సంఘాలు, కుల సంఘాల నాయకులు, అధికారులు, తదికరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో...
జగిత్యాలలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు మనమంతా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉండన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, బీజేపీ నాయకులు యాదగిరి గిరిబాబు, సురభి నవీన్, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ యూ, ఎస్సీ మహేష్ బిగితే, జిల్లా గ్రంథాలయ సంస్థ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ అందరివాడని అన్నారు. దేశంలోని ప్రతి గ్రామం, పట్టణంలోనే కాకుండా పలు దేశాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్రావు, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ నమ్మయ్య, దక్షిత సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్..
కరీంనగర్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి):;భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను కరీంనగర్ 33వ లో ఘనంగా నిర్వహించారు. భగత్ నగర్ ఆదర్శ , జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ సమీపంలో నిర్వహించిన ఈ వేడుకలకు నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై.. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ అధ్యక్షులు అరికిల్ల శంకర్, దాసరి రమేష్, ఆదర్శ యూత్ క్లబ్ అధ్యక్షుడు దొంకిని జయరాం, యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు..
కమాన్ పూర్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
కొత్తపల్లి, ఏప్రిల్ 14: కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ గ్రామం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడి అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిస్తామని నినాదాలు చేసారు.
కొత్తపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్,బీజేపీ కొత్తపల్లి మండలం అధ్యక్షులు కుంట తిరుపతి,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంపల్లి మోహన్, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, టిఆర్‌ఎస్ యూత్ నగర ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షుడు క్యా దాసి కిరణ్ కుమార్, అంబేద్కర్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి తోడేటి మనోహర్,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోన్నారు.
శంకరపట్నలో అంబేద్కర్ జయంతి
శంకరపట్నం,ఏప్రిల్14(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు అంతడ్పుల సతీష్ ఆధ్వ ర్యంలో జరిగాయి. తాసిల్దార్ భాస్కర్ ఎస్త్స్ర రవి, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్,బిజెపి మండల అధ్యక్షుడు అనిల్ ,కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చింతరెడ్డి పద్మ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కవ్వ పద్మ, అంబే ద్కర్ సంఘ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.
మండలంలోని తాడి కల్, కరీంపేట, అంబాల పూర్, కన్నాపూర్, మొలంగూర్,గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలుఘనంగా నిర్వహించారు. మాజీ వైయస్ ఎంపీపీ పులికోట రమేష్ అంబేద్కర్ సంఘ నాయకులు కనకం శంకర్ దాసరపు భద్రయ్య, కనకం శంకర్, కొండ్ర రాజయ్య కొమురయ్య, బోడ సుధాకర్, బొజ్జ రవి మెరుగు శ్రీనివాస్ , మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి ఆలయ చైర్మన్ మల్లారెడ్డి చౌడమల్ల వీరస్వామి మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.