24-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 23 : నియోజకవర్గ ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఐనోలు గ్రామానికి చెందిన రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం.
స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా.. ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంజూరైన రూ.2లక్షల 50 వేల విలువైన ఎల్‌ఓసి అనుమతి పత్రాలను ఆదివారం క్యాంప్ కార్యాలయంలో రాములు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.