కామారెడ్డి (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట విండో ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాలును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్నారు. అనంతరం సాగర్ మండలం మాజీ గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం సమావేశ గదితో పాటు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు, ఏకకాలంలో రుణమాఫీ చేయడం అసాధ్యమని గత ప్రభుత్వం చెప్పిన అంశాన్ని శుసాధ్యం చేసిన ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ పటేల్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సాయి రెడ్డి, వెంకట్, రామ్ రెడ్డి, ఆదిల్, సాయినాథ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.