calender_icon.png 8 January, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

06-01-2025 01:12:29 AM

*  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నల్లగొండ (యాదాద్రి భువనగిరి), జనవరి 5 (విజయక్రాంతి):  విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌లో కాన్వాయ్ నిలిపి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఎస్సీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేశారు.

విద్యార్థులతో మాట్లాడి డైట్ మెనూ, కాస్మోటిక్ చార్జీల వివరాలు, హాస్టళ్లలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యంతో చదవాలని సూచించారు.