ఎమ్మెల్యే రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 (విజయక్రాంతి): మత్స్యకారుల సంక్షేమ మే ప్రభుత్వ లక్ష్యం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, తుర్కయంజాల్ మాసబ్ చెరువులో ఆయన రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చేపపిల్లలను వదిలారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ..
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేయూత నందిస్తుందన్నారు. కొహెడ దగ్గర నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద చేపలు అమ్ముకునేందుకు సరైన స్థలం కాదనుకుంటే, మీకు వెసులుబాటుగా ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానన్నారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ మాట్లాడుతూ..
అక్టోబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన చేపల పంపిణీ కార్యక్రమం నవంబర్ 25తో ముగుస్తుంద న్నారు. రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్, జిల్లా ఫిషరీస్ అధికారిని పూర్ణిమ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.