18-02-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, ఫిబ్రవరి 17 ( విజయ క్రాంతి ) : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల్ మండలం మద్దెలకుంటతండాలో 25కేవీ ట్రాన్స్ ఫారం స్థానిక రైతులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఓర్వలేని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని విఫర్శించడం మొదలు పెట్టారని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా, విఠలయ్య గౌడ్, మహేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.