calender_icon.png 25 November, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

25-11-2024 07:13:21 PM

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఐకెపి సెంటర్లకు ఎలక్ట్రానిక్ కాంటాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగించి ఎవరికి నష్టం కల్గకుండా కొనుగోలు కేంద్రం నిర్వహకులు చూడాలని కొరారు. ప్రభుత్వం రైతులకు నష్టం కల్గవద్దనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ కాంటాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పాత రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్, అనంతరెడ్డి, సుతారి రమేష్, నర్సింహరెడ్డి, భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.