calender_icon.png 19 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే పాల్వంచ సొసైటీ పాలకవర్గం లక్ష్యం

19-03-2025 05:55:38 PM

సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రైతులకు చేదోడువాదోడుగా వుంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా పాల్వంచ సొసైటీ పాలకవర్గం కృషి చేస్తున్నదని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సొసైటీ ద్వారా రైతులకు రుణాల పంపిణి, సబ్సిడీపై విత్తనాల పంపిణి, MRP ధరలకే ఎరువుల పంపిణి, ప్రభుత్వ మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ మోహనరావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి మధుసూధనరావు, భూక్యా కిషన్, నిమ్మల సువర్ణ, CEO G లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.