12-04-2025 01:23:51 AM
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): జఫర్ గడ్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మండలానికి సంబందించిన 68 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 68లక్షల 07వేల 888రూపాయల విలువగల చెక్కులను అలాగే 26మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 07లక్షల 68వేల 500రూపాయల విలువగల చెక్కులను మొత్తం 94మంది లబ్ధిదారులకు 75లక్షల 76వేల 388 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటవెంటనే పరిశీలించి త్వరితగతిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, అధికారులు, మండల నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.