13-02-2025 12:05:26 AM
విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టునర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లైలా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకు న్నారు. “ఆర్టిస్ట్‌గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికీ ఉంటుంది.
భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా అలాంటి గెటప్ చేయాలని ఉండేది. ఈ జనరేషన్‌లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేశా. సోను, లైలా క్యారెక్టర్స్‌లో నాకు లైలా ఇష్టం. కానీ సోను క్యారెక్టర్‌కు కూడా మీరు ఫాన్స్ అయిపోతారు. ట్రైలర్లు పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూశాక మాత్రం సోనుని ఇష్టపడతారు.
లైలాగా సోను మారడానికి మొత్తం మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటి నుంచి బయటపడేందుకు లైలా గా మారుడం జరుగుతుంది. లైలాకు మేకప్ వేయడానికి మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇదొక యూత్ ఫుల్ కంటెంట్. అవు ట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజా య్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపిం చింది. సినిమాలో సాంగ్స్ రాశాక మొహమాటం ఏమీ లేదు. నేను రా స్తాను.
బాగుంటే పెట్టుకోండి అని డైరెక్టర్‌తో చెప్పాను. నా గెటప్ చూ శాక ఇంట్లో వాళ్లు చాలా ఎంజా య్ చేశారు. నువ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి. ఇంట్లో వాళ్ళ ఎంటర్టున్మైంట్ వేరు (నవ్వుతూ). మా అత్త, మమ్మీ మ్యాచింగ్ చీ రలు కట్టుకొని వచ్చా రు. ఈ సినిమాలో మీనాక్షిది చాలా సర్ప్రుజింగ్ రోల్. అద్భుతం గా యాక్ట్ చేసింది. అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఆయన కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ రోల్. సాహు గారు సిని మా క్రాఫ్ట్ తెలిసిన నిర్మాత.
నేను ఈ క్యారెక్టర్ చేయగలని ముందు నమ్మింది ఆయనే. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ ఉటుంది. చిరంజీవి గారు స్టేజ్ మీద ‘నాకే కొరకాలనిపిస్తుందని’ చెప్ప డం ‘లైలా’కు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. ఇక నా తదుపరి సినిమా విషయానికి వస్తే.. ఈ నెలాఖరుకు నటులని పరిచయం చేస్తున్నాం. ఫంకీ మూవీ ఇమ్మిడియట్‌గా స్టార్ట్ చేస్తున్నాం” అని విశ్వక్‌సేన్ తెలిపాడు. ఇక తన పెళ్లి విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “పెళ్లి టైం వచ్చిందని అనుకుంటున్నా. అమ్మాయి ఇలా ఉండాలని ఏమీ అనుకోలేదు” అని తెలిపాడు.