calender_icon.png 3 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

02-04-2025 12:00:00 AM

భారీగా పాల్గొన్న భక్తులు

కార్వాన్, ఏప్రిల్1 (విజయక్రాంతి): శ్రీనివాసుడి కళ్యాణం కమనీయంగా సాగింది.  శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని వసంత నవరాత్రుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ సంఘం రామాలయంలో మఠాధిపతి శ్రీ రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం వేద పండితులు రాజనర్సింహ చారి, కార్తీక్ చారి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు.  శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం స్వామివారిని వాహనంపై లంగర్ హౌస్ లోని పురవీధుల మీదుగా ఊరేగించారు. ఊరేగింపులో స్థానికులు స్వామివారిని దర్శించుకుని మంగళారతులు ఇచ్చారు. కళ్యాణ మహోత్సవంలో లింగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గోవిందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.